18px
#507Telugu Spiritual Song

Stothrinchi keertintumu-Ghanaparachedamu - koniyaadedamu

స్తోత్రించి కీర్తింతుము - ఘనపరచెదము - కొనియాడెదము

ప|| స్తోత్రించి కీర్తింతుము - ఘనపరచెదము - కొనియాడెదము ఆదరించి కాపాడువాడు - ఈడేర్చువాడు
1. మనకింతవరకు సహాయపడెన్ - తానప్పగించుకొనె మనకై మనల నడిపెను సుఖముగను - తనదు సత్యము నేర్పించి కనుపాపగ కాచే ఆ... || స్తో ||
2. ఈ ధరలోని నరులలో - యధార్థహృదయులకు - ముదమున తన చిత్తము తెలుపున్ పదిలముగ ప్రభుకన్నులు - పృథివిని పరుగెత్తు ఆ.... || స్తో ||
3. అన్ని సయములలో కన్నులతో బోధించును - నన్ను మార్చెను తప్పినన్ పెన్నుగ హృదయము నాదరించె - అన్న గురుయేసు ఆ..... || స్తో ||
4. అగ్నివంటి కన్నులు విఘ్నముల నుండి విడిపించు - తగిన సహాయము చేయును ఎక్కాలమందును కునుకవు - మక్కువ పిల్లలకు ఆ..... || స్తో ||
5. హాగరును చూచిన కన్నులు అనేకుల చూచెను - ఇశ్రాయేలుల కనికరించె ఎజ్రాకు సహాయపడెన్ - నిద్రించవు నెపుడు ఆ..... || స్తో ||
6. నీతిమంతుల జూచె దాదిబోలె కాచెన్ - జ్యోతులవలె నుండును అతిబలమిచ్చు అవసరతన్ - క్షితి నినువిడువడు ఆ.... || స్తో ||
7. ఏడు కన్నులు గలవాడు నాడు నేడు కాపాడును - ఎడతెగని చెడుగుల బాపున్ రేడుల నేర్పరచువాడు - పాడుడి హల్లెలూయా ఆ..... || స్తో ||