#508Telugu Spiritual Song
Maa devaa maa devaa needu- Viswaasyatha chaala goppadi
మా దేవ మా దేవ నీదు - విశ్వాస్యత చాలా గొప్పది
ప|| మా దేవ మా దేవ నీదు - విశ్వాస్యత చాలా గొప్పది
1. దయామయుండగు తండ్రివి నీవే - తల్లిని మించిన దాతవు నీవే
మాయా మమతల గాధల నుండి - మమ్ములను రక్షించితివి || మా దేవ ||
2. కోడిపిల్లలను కాసెడు పగిది - ఆపదలన్నింటి బాపితివయ్యా
సర్వకాలములయందున నీకే - చక్కగయ సంస్తుతులగు నీకే || మా దేవ ||
3. సింహపు పిల్లలు ఆకలి గొనిన - సింహపు బోనులో నను వేసినను
సిగ్గు కలుగకుండగ నను నీవు - గాపాడుచున్నా వీ యిలలో || మా దేవ ||
4. మరణ లోయలందున నేనున్న - తరుణములు నాకు విరోధమైన
చరణముల్ పాడెడు విధమున నీవు - నన్నొనర్చుచున్నావుగా || మా దేవ ||
5. వ్యాధులు నన్ను బాధించినను - వ్యాకులములు హృదయములో నున్న
వదలవు నన్నిల అనాథునిగ నెప్పుడు - నను బ్రోచుచు నుందువుగా || మా దేవ ||
6. నీదు నిత్యమాకాశముకంటె - అత్యున్నతముగ స్థాపించబడె
నీదు సత్యమును నీచుడనగు నా - కనులకు ప్రత్యక్షపరచితివి || మా దేవ ||
7. పర్వతంబులు తొలగినగాని - పలు విధ కొండలు తత్తరిల్లినను
పావనుడా నీదు వెల లేనియట్టి కృప - నను విడువదు హల్లెలూయా || మా దేవ ||
