18px
#509Telugu Spiritual Song

Stutintun parishudduni aaraadanatho

స్తుతింతున్ పరిశుద్ధుని ఆరాధనతో - ఇంతవరకు కాచె దేవుడే

ప|| స్తుతింతున్ పరిశుద్ధుని ఆరాధనతో - ఇంతవరకు కాచె దేవుడే
1. ఇరువదై దేండ్లు గాకెన్ - కొరతలేని మేళ్లనిచ్చే చేర్చె ప్రజల నెందరినో - చేరిపాడి స్తుతించెదము || స్తుతించెదము ||
2. సువార్త సైన్యము నిచ్చి - భువిపై శత్రుని పనినాపే వినినవారిని ప్రత్యేకించె - చేరిపాడి స్తుతించెదము || స్తుతించెదము ||
3. పరిశుద్ధ సంఘము కూర్చె - నేర్పె సత్య మర్మములు సరిగ సాక్ష్యము స్థాపించె - చేరిపాడి స్తుతించెదము || స్తుతించెదము ||
4. సేవకులనిచ్చెను బహుగా - కావలియుంచెన్ ప్రభువే సహపని - వారి నొసగె - చేరిపాడి స్తుతించెదము || స్తుతించెదము ||
5. ఇండియాలో ఈ నగరు - అంతియొక్కయవలె జేసె స్వంతముగను జేసుకొనెన్ - చేరిపాడి స్తుతించెదము || స్తుతించెదము ||
6. పరమ దర్శనమునిచ్చె - సరిగా లోబరచె మనల కరము నిచ్చె నడిపించె - చేరిపాడి స్తుతించెదము || స్తుతించెదము ||
7. సంఘ మర్మమును దెల్పి - శ్రీఘముగ నంపెను వార్త మార్చె పాపుల నెందరినో - చేరి స్తుతించెదము హల్లెలూయ || స్తుతించెదము ||