18px
#510Telugu Spiritual Song

Aanandamugaa yehovaa nee krupalanni

ఆనందముగా యెహోవా నీ కృపలన్ని - అన్ని కాలంబులందు కీర్తించెదన్

ప|| ఆనందముగా యెహోవా నీ కృపలన్ని - అన్ని కాలంబులందు కీర్తించెదన్
1. చావు గోతినుండి లేవనెత్తి నాకు - జీవమిచ్చిన జీవదాత వివరింతు నే నీదు విశ్వాస్యత నెంతయో - సవ్యంబుగా ఈ భువియందున్ || ఆ ||
2. సింహపు పిల్లలు ఆకలిగొనును - యెహోవా సహాయుడందరికి ఇహమందున ఏ మేలు కొదువయుండదు - ఆహా! ఏమందు నీ విశ్వాస్యతన్ || ఆ ||
3. ఎన్నెన్నో శోధన బాధలు రేగి - నన్ను కృంగదీయ పోరాడినన్ ఘనమైన నీ విశ్వాస్యతన్ నాకు చూపిన - కన్నతండ్రీ నిన్ను కొనియాడెదన్ || ఆ ||
4. చావు చీకట్ల లోయలందున - జీవపు వెలుగై త్రోవజూపి దేవా తోడై నడిపించితివి నీ కృపన్ - వివరించెదన్ నీ విశ్వాస్యతన్ || ఆ ||
5. నీతి న్యాయములు ఆధారములై - నీ సింహాసనమున నిలచినవి నిత్యకృపా సత్యంబులు నీదు సన్నిధిన్ - నిరతంబు వెలసి నిలచినవి || ఆ ||
6. పర్వతంబులు పారిపోయినను - ఉర్విలో మార్పు కలిగినను తరుణములు విరోధముగ పైలేచిన - స్మరియించెద నీ విశ్వాస్యతన్ || ఆ ||