18px
#511Telugu Spiritual Song

Kruthagnathan thalavanchi- Naadu jeevamu arpintunu

కృతజ్ఞతన్ తలవంచి - నాదు జీవము అర్పింతును

ప|| కృతజ్ఞతన్ తలవంచి - నాదు జీవము అర్పింతును లేదే యికనే ఈవి యిల - అర్పింతును నన్నే నీకు
1. దూరమైతి నీ ప్రేమ మరచి - నే రేపితి నీ గాయముల్ దూరముగనిక వెళ్లజాల - కూర్చుండెద నీ చెంతనే || కృత ||
2. ఆకర్షించె లోకాశలన్ని - లోక మహిమ నడ్డగించు కోర్కెలన్ని క్రీస్తు ప్రేమకై - నిక్కముగా త్యజింతును || కృత ||
3. తరముల నీ ప్రేమ నాకై - వర్ణింపను అశక్యము నిరంతరము సేవించినను - తీర్చలేను నీ ఋణము || కృత ||
4. లోకముకై జీవించనింక - నీ కొరకై జీవింతును నీ కర్పింపన్ నే వెనుదీయన్ - ఈ కొద్ది నా జీవితము || కృత ||
5. చింతించితి గత పాపములకై - ఎంతో నేను యేడ్చుచుంటి కృతజ్ఞతతో సమర్పింతును - బ్రతుకంతయు నీ సేవకై || కృత ||