#512Telugu Spiritual Song
Stutulu nee karpinthumu – satatamu
స్తుతులు నీకర్పింతుము - సతతము మా ప్రభువా సన్నుతించెదం
ప|| స్తుతులు నీకర్పింతుము - సతతము మా ప్రభువా సన్నుతించెదం
1. గడచినట్టి కాలము - కరుణతో నన్గాంచితివి
వెల లేనట్టి నీ కృప - చూపినట్టి మా ప్రభు || స్తుతు ||
2. నాదు దినము లన్నిటిన్ - నీదు క్షేమమేలును
నీదు జాడలన్నియున్ - సారంబు నిచ్చును || స్తుతు ||
3. నీదు మందిరంబులో - మేలుచేత మమ్మును
తృప్తిపరచిన ప్రభు - స్తుతులు నీకే చెల్లును || స్తుతు ||
4. నీదు నామ ఘనతను - నీదు ప్రేమ పనులను
నాథుడా నే పాడెద - నాదు ప్రియ ప్రభువా || స్తుతు ||
5. సత్యరూపి నీవెగా - సకల సృష్టికర్తవు
సతతము మమ్మేలుము - హల్లెలూయ పాడెదం || స్తుతు ||
