#513Telugu Spiritual Song
Memu bhaya padamu – ika memu bhayapadumu –
మేము భయపడము ఇక మేము భయపడము
ప|| మేము భయపడము ఇక మేము భయపడము
ఏకీడు రాదని యేసే చెప్పెను మాకు || మేము ||
1. దైవభ్రష్టులమైన మమ్ము దివ్యంపుగా రక్షించె
దివారాత్రులు దేవుడే కాయును || మేము ||
2. శత్రుకోటి మమ్ము జుట్టన్ పాతాళము మ్రింగ
జూడన్ నిత్యుడు యేసు నిత్యము కాయును || మేము ||
3. అగ్ని పరీక్షలయందు వాగ్ధానమిచ్చె మాతోనుండ
యే ఘడియైనను విడువక కాయును || మేము ||
4. బలమైన ప్రభు హస్తములు వలయమువలె మమ్ముజుట్టి
పలు విధములుగా కాపాడుమమ్ము || మేము ||
5. కునుకడు మన దేవుడు యెన్నడు నిద్రించడు
కనుపాపగ మము కాపాడునెప్పుడు || మేము ||
6. జీవిత కష్టనష్టములు ఆవరించి దుఃఖపరచ
దేవుడ - సంగిన ఈవుల నెంచుచు || మేము ||
7. ఇహమందు మన శ్రమలన్ని మహిమకుమార్చెడు ప్రభున్
మహిమపరచి మ్రెంుక్కెదమిలలో || మేము ||
