#514Telugu Spiritual Song
Bhayamu leduga manaku bhayamu leduga
భయములేదుగా మనకు భయములేదుగా
ప|| భయములేదుగా మనకు భయములేదుగా
దయగల మన దేవుడుండ భయము లేదుగా
1. కక్షామ మరణ యుద్ధ ఖడ్గబలము నుండియు
ధరణి గిరులు అదరి సముద్రములు పొంగిన
పరిశుద్ధ్దుడు యేసుడే నిత్యము కాపాడుగనుక || భయ ||
2. అపవాది తంత్రములపై విజయమిచ్చును
అభయమిచ్చి క్షేమముగ ఆదరించును
అక్షయుడగు యేసుడే నిత్యము కాపాడు గనుక || భయ ||
3. దివారాత్రులు దేవుడు ధైర్యపరచును
ఈ కాలపు శ్రమలే మనల మార్పు మహిమకు
నిర్మలుడగు యేసుడే - నిత్యము కాపాడుగనుక || భయ ||
4. శ్రమలు దుఃఖ బాధలెన్నో మనకు సోకిన - ఏకీడు తగులకుండ కాయు
శక్తితో శక్తిమంతుడు యేసుడే నిత్యము కాపాడుగనుక || భయ ||
5. పాడెదము మన ప్రభునకే హృదయ గీతము-మహిమరాజు మన కొరకై
తిరిగి వచ్చును మన ప్రభువగు యేసుడే నిత్యము కాపాడు గనుక || భయ ||
