18px
#515Telugu Spiritual Song

Prabhuni rakada eedinameparugulidi randi sudiname A. P.

ప్రభుని రాకడ ఈ దినమే - పరుగులిడి రండి సుదినమే

ప|| ప్రభుని రాకడ ఈ దినమే - పరుగులిడి రండి సుదినమే
అ.ప. పరమునందుండి మన ప్రభువు - ధరకు నరుగును పాలనకై బూరశబ్దముతో - జనులారా
1. సిద్ధులగువారిన్ మన యేసు - శుద్ధి జేయునిలన్ పరమునకై బుద్ధిహీనులను - శ్రమలచేత బుద్ధులుగ జేయున్ వేదనతో బాధ కలిగించున్ - సాతాను || ప్రభుని || 2స్వరముతో వచ్చున్ అధికారి - మహిమతో మరలున్ తనదూత సూర్యచంద్రునిలన్ తారలతో - జీకటుల్ క్రమ్మున్ ప్రభురాక పగలు రాత్రియగున్ - త్వరపడుము || ప్రభుని ||
3. మొదట లేతురు సజీవులై ప్రభునియందుండు ఆ మృతుల మరల అందరము ఆ ధ్వనితో పరము జేరుదుము ధరనుండి - ధన్యులగుదుము పరికించు || ప్రభుని ||
4. వెయ్యియేండ్లు పాలించెదరు ప్రియుని రాజ్యమున ప్రియులు, సాయం సమయమున - చేరి నెమలి కోకిలలు రాజున్ - పాడి స్తుతించును ఆ దినము || ప్రభుని ||
5. గొర్రె మేకలును ఆ చిఱుత సింహ జాతులును ఒక చోట భేదము లేక బరుండి గరికమేయును - ఆ వేళ కలసి మెలగును భయపడక || ప్రభుని ||
6. న్యాయనీతులన్ మన ప్రభువు - ఖాయముగ దెల్పున్ ఆనాడు సాక్షులుగ నిలుతుం అందరము - స్వామి యేసునకు ధ్వజమెత్తి చాటి యేసునకు - ఓ ప్రియుడా || ప్రభుని ||