#516Telugu Spiritual Song
Adigo vacchunadevaro chudumu –Mahima galgina mana yese
అదిగో వచ్చునదెవరో చూడుమా - మహిమ గలిగిన మన యేసే
ప|| అదిగో వచ్చునదెవరో చూడుమా - మహిమ గలిగిన మన యేసే
నీ కన్నులెత్తి చూడుమా - క్రీస్తు ప్రభావముతో వచ్చుచుండెన్
1. మేఫూరూఢుడై వచ్చుచున్నాడు - కంపించెను ఆకాశమెల్ల
వీణ... వాయింప దూతల్ పాడంగ - పెండ్లి కుమారుండై వచ్చుచుండెన్ || అదిగో ||
2. సూర్యచంద్రులు అదృశ్యులైరి - మృతులెవ్వరులేరు అచ్చట
అందరు భయపడి వణుకుచున్నారు - తీర్పుచేయ క్రీస్తు వచ్చుచుండెన్ || అదిగో ||
3. గతించును మనమున్న లోకము - నూతన లోక మొకటి కలుగును
నూతనమగును జగమంతయును - క్రీస్తు రాజ్యమేల వచ్చుచుండెన్ || అదిగో ||
4. ముండ్ల మకుటము నింకలేదు - మహిమ కిరీటము ధరించెను
అలంకారముతో అందమైయున్న - పెండ్లి కుమార్తెకై వచ్చుచుండెన్ || అదిగో ||
