#518Telugu Spiritual Song
Jayamani paadu prabhu yesunake
జయమని పాడు ప్రభుయేసునకే హోసన్నజై
ప|| జయమని పాడు ప్రభుయేసునకే హోసన్నజై
ప్రభు వచ్చుచుండె యెంతో సంతసము
మధ్యాకాశమందు సంధించెదము
1. మనము మారెదము మర్మమిది గొప్పదే
బూరధ్వని మ్రోగగానే మన మెత్తబడెదము
ప్రియ యేసుని సంధింప, మనమాయనవారమే || జయ ||
2. ప్రభుని పోలియుందుము ప్రభుని సంతతిగా
ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు అమర్త్యత ధరింతుము
పొందెదము ప్రభువునే, మనమాయనవారమే || జయ ||
3. మన నిరీక్షణయే ప్రభుని చూతుమని
తృప్తిచెంది నింపబడెదం వాంఛలు తీరును
ప్రభుని రుచించెదము, మనమాయనవారమే || జయ ||
4. దైవ సంకల్పమే ప్రభువుతో నుండుటే
దేవుని గృహమానంద మహిమతో నిండియుండును
ప్రభువు మనవాడు, మనమాయనవారమే || జయ ||
