18px
#519Telugu Spiritual Song

Jagratha bakthulara pilupide - prabhuyesu vega vachunu

జాగ్రత్త, భక్తులారా పిలుపిదే - ప్రభుయేసు వేగ వచ్చును

ప|| జాగ్రత్త, భక్తులారా పిలుపిదే - ప్రభుయేసు వేగ వచ్చును వందనం, హోసన్న, రాజాధిరాజు వచ్చును వినుమారాద్భుటము బూరధ్వనియు - ప్రధానదూత శబ్దము
1. చాలా రాత్రి గడిచిపోయె చూడు పగలు వచ్చెనుగా విడువుము అంధకార క్రియలు తేజో ఆయుధముల ధరించుము || జాగ్రత్త ||
2. గుర్తులన్నియ నెరవేరినవి నోవహు కాలము తలచుము లోతుభార్యను మరచిపోకు మేలుకొనెడి సమయమువచ్చె || జాగ్రత్త ||
3. మన దినములు లెక్కింపబడెను మేల్కొను వారికి భయమేమి ఘనముగ వారెత్తబడుదురు - యెవరు ప్రభువుతో నడచెదరో || జాగ్రత్త ||
4. దైవజనులు కలుతురు గగనమున - ప్రభునందు మృతులు జీవింతురు మేఘమునందు - ఎల్లరు చేరి అచ్చటనే ప్రభుని గాంతురు || జాగ్రత్త ||
5. క్రియలను బట్టి ప్రతిఫలమిచ్చును విజయులే దాని పొందెదరు ప్ర"తిగ పల్కును ప్రభువే మనతో నావన్నియు మీవేయనుచు || జాగ్రత్త ||