18px
#520Telugu Spiritual Song

Rakshana nosagedu Yesuni premanu

రక్షణ నొసగెడు యేసుని ప్రేమను - లక్ష్యము చేయుము ఓ ప్రియుడా

ప|| రక్షణ నొసగెడు యేసుని ప్రేమను - లక్ష్యము చేయుము ఓ ప్రియుడా అక్షయ రాజ్యము నీయను వచ్చిన - రక్షకున్ బొగడుము స్నేహితుడా
1. లోకపు ప్రేమను యేమని తెల్పెద - నీ కవమానంబే దలచినచో మారని యేసుని రక్షకున్ ప్రేమ - తాకుడు నొందుము ఓ ప్రియుడా || రక్షణ ||
2. పాపపు ప్రేమలో విడువక నిలిచిన - తాపము చెందెద వో నరుడా పాపిని గావను ప్రేమ స్వరూపుడు - శాపము నోర్చెను కల్వరిలో || రక్షణ || 3చచ్చిన పాపిని వెదకి రక్షింప - చచ్చి బ్రతికిన ఘనుడెవడు వచ్చిన పాపిని వద్దని త్రోయని - నిశ్చల ప్రేమామయుడు యేసే || రక్షణ ||
4. నమ్ముము సోదరా నిన్ను రక్షించును - నెమ్మది నొందెదవు నిజము నమ్మనిచో ప్రభుప్రేమను గానవు - నమ్ముము ప్రభు ప్రేమ నీ దినమే || రక్షణ ||
5. ఘన ధనికుల మత సౌందర్యంబులన్ - గానవు నిజ ప్రేమాదరణల్ ఎన్నిల నున్నను నిలచునే నిత్యము - పెన్నుగ బొందుము ప్రభు ప్రేమన్ || రక్షణ ||
6. తండ్రి కుమార శుద్ధాత్మల చిత్తమున్ - దండిగ నెరవేర్చుచు ఘనులు ఎందరో నేగిరి పొందను మకుటము - పొందుము ప్రభు యేసు హల్లెలూయ || రక్షణ ||