18px
#521Telugu Spiritual Song

Stotrinchi keertinchedamu – Halleluya – stuti

స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయ స్తుతి

ప|| స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయ స్తుతి - చెల్లంచి యుల్లసింతుము హల్లెలూయ
అ.ప. గడచిన కాలమెల్ల కంటిపాపవలె - కాచెను ప్రభువు మమ్ము హల్లెలూయ - ప్రభున్
1. పాపమును బాపినాడు హల్లెలూయ - మన శాపమును మాపినాడు హల్లెలూయ కన్నతల్లివలెనె కనికరించెను మమ్ము - యెన్నతరమా ప్రేమ హల్లెలూయ - ప్రభున్ || స్తో ||
2. తల్లియైన మరచినను హల్లెలూయ - తాను ఎన్నడైన మరచిపోడు హల్లెలూయ ఎల్ల ఈవులనిచ్చి యుల్లాస మొసగును - కొల్లగ మనల కోరి హల్లెలూయ - ప్రభున్
3. శోధన కాలములందు హల్లెలూయ - మన వేదన కాలములందు హల్లెలూయ నాథుడు యేసు మన చెంతనుండ నిల - చింతలేమియు రావు హల్లెలూయ - ప్రభున్
4. ఘోర తుఫాను లెన్నెన్నో హల్లెలూయ బహు - ఘోరముగ లేచినను హల్లెలూయ దోనెయందున్న యేసు దివ్యముగను లేచి - ధాటిగా వాటి నణచు హల్లెలూయ ప్రభున్
5. సర్వలోకమునందున హల్లెలూయ - నన్ను సాక్షిగ నుంచెను యేసు హల్లెలూయ చేరిన వారినెల్ల కోరి ప్రేమించు నేసు - చేర్చును కౌగిటిలో హల్లెలూయ - ప్రభున్