18px
#522Telugu Spiritual Song

Devaa nee sanidhilo nilachi - Deenulamai mora pettuchunnaamu

దేవా నీ సన్నిధిలో నిలచి - దీనులమై మొఱ్ఱపెట్టుచున్నాము

ప|| దేవా నీ సన్నిధిలో నిలచి - దీనులమై మొఱ్ఱపెట్టుచున్నాము
1. అపరాధులగు నీదు ప్రజల నెపములన్నియు బాపి కృపాళుండగు యేసు ప్రభువా - కృపనుజూపి రక్షించుమయా || దేవా ||
2. చేసియున్నాము నేరములెన్నో చేసిన మేలులను మరచి మోసములలోబడియున్నాము - యేసుప్రభు జయమునిమ్ము || దేవా ||
3. లోకపు మర్యాదలకు లొంగి లోకుల మాటలను వినియు నీ కట్టడలను మరచితిమి - కట్టుము మమ్ము నీ వాక్యముచే || దేవా ||
4. నిస్వార్ధులగు నీ దాసులను విశ్వాస ప్రమాణికులన్ శాశ్వతమైన ప్రేమతో నింపు - విశ్వాసులు స్థిరపడి నడువ || దేవా ||
5. సహవాసములో మమ్ము నిలిపి సహసము మాకు నేర్పించి మహిమపూర్ణుడ యేసు - నిన్ను ఈ మహిలో చాటించుటకు || దేవా ||