18px
#523Telugu Spiritual Song

Praardhana vinedu devaa- Praardhinchu manina prabhuvaa

ప్రార్థన వినెడు దేవా ప్రార్థించుమనిన ప్రభువా

ప|| ప్రార్థన వినెడు దేవా ప్రార్థించుమనిన ప్రభువా స్వార్థమునెల్లను ద్రోసి దరి జేరితిమి మముజూడు (2)
1. పొందిన మేలుల మరచి మందిర సమృద్ధిన్ విడచి పొందితిమిలలో బాధల్ నిందను తెచ్చితిమయ్యా || ప్రార్థన ||
2. ఒప్పుకొనుచుంటి మిలలో మా పితరులవలె మేము అపవిత్రులమై నీదు కోపము రేపితిమయ్యా || ప్రార్థన ||
3. ఇరుకున పడియుంటిమి పరులెల్లరు మము జూచి పరిహాసమును చేయ తరుణము నిచ్చితిమయ్యా || ప్రార్థన ||
4. ఆశించితిమి నిన్ను శాశ్వత కృపగల దేవా త్రోసివేయని మా దేవా నీ చెంత జేరితిమయ్యా || ప్రార్థన ||
5. నీ ముఖమును దాచకుము నీ మార్గమును నేర్పించు నింపు నీయాత్మను మాలో సంపూర్ణులుగా జేయుమయ్యా || ప్రార్థన ||