18px
#524Telugu Spiritual Song

Ne yesuni velugulo nadichedanurathrimbagalaayanato nadichedanu

నే యేసుని వెలుగులో నడిచెదను - రాత్రింబగలాయనతో నడిచెదను

1. నే యేసుని వెలుగులో నడిచెదను - రాత్రింబగలాయనతో నడిచెదను వెల్గున్ నడిచెదను - వెంబడించెదను - యేసుడే నా రక్షకుడు
ప|| నడిచెద నే ప్రభుయేసునితో - నడిచెద నే ప్రభు హస్తముతో కాంతిలోనుండగ జయంగాంతును - యేసునే నే వెంబడింతును
2. నే యేసుని వెలుగులో నడిచెదను - గాఢంబగు చీకటిలో భయపడను ఆత్మతో పాడుచు సాగిపోవుదును - యేసుడే నా ప్రియుండు || నడి ||
3. నే యేసుని వెలుగులో నడిచెదను - వెల్గులో ప్రభు స్వరము నే వినుచుందును సర్వమిచ్చెదను చెంత నుండెదను - యేసుడే ప్రేమామయుడు || నడి ||
4. నే యేసుని వెలుగులో నడిచెదను - దిన సహాయము నే పొందెదను సుఖ దుఃఖమైన మరణంబైన - యేసుడే నా యండనుండును || నడి ||
5. నే యేసుని వెలుగులో నడిచెదను - నా దృష్టిని ప్రభుపై నుంచెదను సిల్వధ్వజమునే బట్టి వెళ్లెదను - యేసుడే నా చెంత నుండును || నడి ||