18px
#525Telugu Spiritual Song

Samaadhana-gruhambulonusamaadhana - kartha stotramulu

సమాధాన గృహంబులోను - సమాధానకర్త స్తోత్రములు

ప|| సమాధాన గృహంబులోను - సమాధానకర్త స్తోత్రములు
1. క్రీస్తు యేసు మనకిలలో - నిత్య సమాధానము మధ్యపుగోడను కూలద్రోసెను - నిత్యశాంతిని మనకొసగెన్ || సమాధాన ||
2. నదివలె సమాధానం - వడిగా ప్రవహించుచున్నది అడ్డుల ద్రోసి - మధ్యను నిలిచె - శ్రద్ధతో మధ్యకు చేర్చెన్ || సమాధాన ||
3. లోకమిచ్చునట్లుగా కాదు ప్రభు సమాధానము సత్యమైనది నిత్యము నిల్చును - నిత్యుడేసుచే కల్గెన్ || సమాధాన ||
4. దేవుని రాజ్యమిల కాదు - భోజన పానముల్ నీతియు సమాధానము నిల పరిశుద్ధాత్మలో ఆనందం || సమాధాన ||
5. పర్వతములు తొలగినను - తత్తరిల్లిన కొండలు నాదు కృప నిన్ను విడువదనెను - నా సమాధానము ప్రభువే || సమాధాన ||
6. ఆశ్చర్యకరుడు యేసే ఆలోచన కర్తయు బలవంతుడేసు సమాధాన ప్రభు - బలపరచు తన ప్రజలను || సమాధాన ||