#527Telugu Spiritual Song
Mana mesuni vaaralamu-thana - Vaarigane yundumu-manalanu
మన మేసుని వారలము - తన వారిగానే యుందుము
ప|| మన మేసుని వారలము - తన వారిగానే యుందుము
మనలను రక్షించెను - తనకే స్తుతి పాడెదము
1. కృపాసత్య సంపూర్ణ వాక్యము - నరరూపియాయెను
కనుగొంటిమి తండ్రి మహిమను - జనితైక కుమారునిలో
తన ప్రేమ అద్భుతమైనది - మనము కొనియాడెదము || మన ||
2. వారు ఆయన తట్టు చూడగా వెలుగు కలిగెను
మనలను తానే వెలిగించెను - తన వాక్యము ద్వారానే
ప్రభు వుత్తముడని యెరిగి - తనకే స్తుతి పాడెదము || మన ||
3. దైవపుత్రుండు సజీవరాళ్లతో యింటిని కట్టుచున్నాడు
దేవుని తేజమురాగా - మహిమతో నిండె గృహము
ఆయన మందిరములో - తన మహిమను పాడెదము || మన ||
4. ఎందరిని ప్రభు ముందు యెరిగెనో - వారిని నిర్ణయించెను
పిలిచి నీతిగా తీర్చి - మహిమపరచెను - తన తనయుని రూపమిచ్చె
మన మానంద మొందెదము || మన ||
5. పూర్ణ మహిమతో ప్రభుయేసు - దూతలతో వచ్చును
కనిపెట్టు వారెత్తబడుదురు - తన మహిమ పొందెదరు
తన రాజ్యముగా జేసె - హల్లెలూయ పాడెదము || మన ||
6. మహిమ వసించు మహిమ రాజ్యంబు - మహిమతో నిండియుండును
మన ప్రభువే దీపమై ఉండును - తన వెలుగు ప్రచురమగున్
యుగయుగములు మనమంతా - ప్రభు యేసుతో నుండెదము || మన ||
