18px
#528Telugu Spiritual Song

Jeevithambu ghora kastanastamulaavarinchi

జీవితంబు ఘోర కష్టనష్టముల్ - ఆవరించి నిన్ను దుఃఖపర్చిన

1. జీవితంబు ఘోర కష్టనష్టముల్ - ఆవరించి నిన్ను దుఃఖపర్చిన దేవుడిచ్చినట్టి ఈవులెంచుము - నీ వాశ్చర్యమొందెదవు వాటికై || ఎంచు ||
ప|| ఎంచుము లెక్కించు మీవులన్ - ఎంచి, చూడు మేసు దీవెనల్ ఎంచు, మెంచు - మెంచు మీవులన్ - వింత నొందెదవు నీవు వాటికై
2. చింత మానసంబు నీకు గల్గినన్ - వంతచే భారంబు గల్గు నీయెదన్ సంతసంబుతోడ నెంచు మీవులన్ - వింతతో స్మరించు మేసు నామమున్ || ఎంచు ||
3. నాశనంబు జెందు నాస్తి జూచినన్ - వాసిగా శ్రీయేసు నా కొసంగిన భాసురంపు భాగ్యము దలంపుమా - ఈ సుభాగ్యమే కదా సదాయుండు || ఎంచు ||
4. జీవితాదియందు ధైర్యమొందుము - దేవుడుండు తన వార్కి తోడుగ జీవయాత్రయందు సాయమియ్యగన్ - దేవదూతల్ నీకు తోడుగా నుండు || ఎంచు ||