18px
#530Telugu Spiritual Song

Lechinaaduraa samaadhi gelichinaaduraayesu

లేచినాడురా సమాధి గెలిచినాడురా

ప|| లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా
అ.ప. లేతునని తా జెప్పినట్లు - లేఖనములో పలికినట్లు
1. భద్రముగా సమాధిపైని - పెద్దరాతిని యుంచిరి భటులు ముద్రవేసి రాత్రియంత - నిద్రలేక కావలియున్న || లేచి ||
2. ప్రభువు దూత పరమునుండి - త్వరగా దిగి రాతిని పొర్లించి భళిర దానిపై కూర్చుండె - భయమునొంద కావలివారు || లేచి ||
3. ్రపొద్దుపొడవక ముందె స్ర"్తలు - సిద్ధపరచిన సుగంధమును శ్రద్ధతోడ తెచ్చి యేసుకు - రుద్దదామని వచ్చిచూడ || లేచి ||
4. చూడవెళ్లిన స్ర"్తలనుదూత - చూచియపుడే వారితోడ లేచి గలిలయ ముందుగ - పోతున్నాడు అపుడే లేచినాడని || లేచి ||
5. చచ్చిపోయి లేచినాడు - స్వామి భక్తుల కగుపడినాడు చచ్చినను నను లేపుతాడు - చావుఅంటే భయపడరాదు || లేచి ||
6. నేను చేసె పనుల నెరుగు - నేను నడిచె మార్గ మెరుగు నేను చెప్పు మాట లెరుగు - నేను బ్రతికె బ్రతుకునెరుగు || లేచి ||
7. నేను లేచిన యేసునందు - మానక మది నమ్ముకొందు తానునాలో యుండినందున - దయను జేర్చును మోక్షమందు || లేచి ||
8. పాపభారము లేదు మనకు - మరణభయము లేదు మనకు నరకబాధ లేదు మనకు - మరువకండి యేసు ప్రభుని || లేచి ||
9. యేసునందే రక్షణభాగ్యం - యేసునందే నిత్యజీవం యేసునందే ఆత్మశాంతి - యేసునందే మోక్షభాగ్యం || లేచి ||
10. పాపులకై వచ్చినాడు - పాపులను కరుణించినాడు పాపులను ప్రేమించినాడు - ప్రాణదానము చేసినాడు || లేచి ||