18px
#531Telugu Spiritual Song

Ee loka yaatralo ne saagu chunda

ఈ లోక యాత్రలో నే సాగుచుండ

ప|| ఈ లోక యాత్రలో నే సాగుచుండ(2) ఒకసారి నవ్వు ఒకసారి యేడ్పు(2) అయినను క్రీస్తేసు నాతోడ నుండు(2)
1. జీవితయాత్ర యెంతో కరిఠనము (2) - ఘోరాంధకార తుఫానులున్నవి (2) అభ్యంతరములు యెన్నెన్నో వుండు (2) - కాయువారెవరు రక్షించేదెవరు (2) || ఈలోక ||
2. హృదయము శుద్ధిపరచుకొన్నాను - నా చేతులెంతో పరిశుద్ధ పరచ అనుకొనని రీతి అపవాది వచ్చి - నా జీవితమును నిరాశపరచె || ఈలోక ||
3. నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా - అనుదినము నన్ను ఆదరించెదవు నీతో వున్నాను విడువలేదనెడు - నీ ప్రేమ మధుర స్వరము విన్నాను || ఈలోక ||
4. ఈ అనుభవముతో నేనడచు కొందు - ప్రియ యేసువైపు నేను చూచుచు గతమునంత నేను మరచిపోయెదను - కన్నీరు తుడుచు నా ప్రియ ప్రభువు || ఈలోక ||
5. తోడైయుండెదవు అంతము వరకు - నీవు విడువవు అందరు విడచినను నూతనబలము నా కొసగెదవు - నే స్థిరముగ నుండ నీ కోరిక యిదియే || ఈలోక ||