18px
#532Telugu Spiritual Song

Jayinchu vaarini koni pova - Prabhu Yesu vachchunu

జయించువారిని కొనిపోవ ప్రభుయేసు వచ్చును

ప|| జయించువారిని కొనిపోవ ప్రభుయేసు వచ్చును స్వతంత్రించు కొనెదరుగ వారే సమస్తమున్
1. ఎవరు యెదురుచూతురో సంసిద్ధులలొదురు ప్రభురాక నెవరాశింతురో కొనిపోవ క్రీస్తువచ్చును || జయిం ||
2. యేసుశిష్యులతో పల్కె తిరిగివత్తునని సిద్ధపరతు స్థలమును నేనున్నచోట మీరుండ || జయిం ||
3. యెవరేసునితో నడతురో ప్రత్యేకమవుదురు మేల్కొనియున్న వారిని ప్రభుక్రీస్తు కొనిపోవును || జయిం ||
4. క్షణములోనే మార్పుచెంది ఎత్తబడెదము మమ్మును సిద్ధపరచిన శ్రీయేసును సంధింతుము || జయిం ||
5. తన సన్నిధిలో మనల నిలుపు నిర్ధోషులనుగా బహుమానముల్ పొందెదము ప్రభుని కోరిక యిదే || జయిం ||
6. సదా ప్రభుని తోడనుండి స్తుతి చెల్లింతుము అద్భుతము ఆ దినమును ఎవరు వర్ణింపలేరుగా || జయిం ||