18px
#533Telugu Spiritual Song

Prabhuni gruhamu aayana mahimatho

ప్రభుని గృహము ఆయన మహిమతో - పరిపూర్ణముగా నిండెను

ప|| ప్రభుని గృహము ఆయన మహిమతో - పరిపూర్ణముగా నిండెను
1. అపరాధములచే ప్రజలందరును - దేవుని మహిమను కోల్పోయిరి తన మహిమను మనకిచ్చుటకు - యేసుప్రభువే బలియాయెన్ || ప్రభుని ||
2. కృపా సత్యములు సంపూర్ణముగా - మన మధ్యలో వసించెను తండ్రి మహిమను తన సుతునిలో - మన మందరము చూచితిమి || ప్రభుని ||
3. ప్రభువు యింటిని నిర్మించుచుండె - సజీవమైన రాళ్లతో ఆయన మహిమ దానియందుండ - తన సంకల్పమై యున్నది || ప్రభుని ||
4. శాంతిరాజు యిల్లు కట్టుచున్నాడు - మానవ హస్తము అందుండదు క్రయమునిచ్చి స్థలముకొనెను - తాను కోరిన స్థలమదే || ప్రభుని ||
5. ప్రత్యేకపరచిన ఆత్మీయ యింటికి - తన పునాదిని వేసెను రక్షణ జీవిత సాక్ష్యము ద్వారా - ప్రభువే సర్వము చేసెను || ప్రభుని ||
6. సింహాసనముపై కూర్చున ప్రభువే - అణగ ద్రొక్కెను శత్రువును సంపూర్ణ జయముతో ఆరాద్భుటముతో - వెలిగించెను తన యింటిని || ప్రభుని ||
7. దేవుని యిల్లు ముగించబడగా - పైనుండి అగ్ని దిగివచ్చున్ దహించబడును సర్వమలినము - ఇంటిని మహిమతో నింపును || ప్రభుని ||