#534Telugu Spiritual Song
Parishudda mandiramu naakunirmincha-mantiri prabhuvaa
పరిశుద్ధ మందిరము నాకు - నిర్మించమంటిరి ప్రభువా
ప|| పరిశుద్ధ మందిరము నాకు - నిర్మించమంటిరి ప్రభువా
ఇశ్రాయేలు నివాసమొకటి - ఏర్పరచ మంటిరి ప్రభువా
1. తుమ్మక్రరతో మందసమును జేసి - బంగారును పొదిగించిన
తుమ్మ క్రర మీరేయని యంటిరి || పరిశుద్ధ ||
2. కరుణాపీఠము కావలెనంటిరి - కరుణాపీఠము నేనేయనుచు
ప్రాణమిడితిరి కరుణను జూపి || పరిశుద్ధ ||
3. బలి పీఠమును చేయుమంటిరి
బలిపీఠము నా సిలువయే యనుచు - బలియైతిరి మీ రక్తము కార్చి || పరిశుద్ధ ||
4. ఆవరణ ద్వారంబుల జేసి
ముగించితిని మీ పనినంతటిన్ - మహిమయు ఘనత నీకే కల్గున్ || పరిశుద్ధ ||
5. నావన్నియును మీకిచ్చితిని - మీ వన్నియును నావే ప్రభువా
కృప జూపితిరి మీ మహాప్రేమన్ || పరిశుద్ధ ||
6. పరిశుద్ధ పట్టణమునందు - నివాస స్థలము నా కొసగితిరి
తరతరములు మీతో నివసింతున్ || పరిశుద్ధ ||
