18px
#535Telugu Spiritual Song

Aadi Premanu vidichi pettithivaa - oh naadu priyudaa

ఆది ప్రేమను విడచిపెట్టితివా - ఓ నాదు ప్రియుడా

ప|| ఆది ప్రేమను విడచిపెట్టితివా - ఓ నాదు ప్రియుడా మాదిరిగ జీవించ మానితివా (2)
1. నీవే నా రక్షకుడవనియు దేవుని క్రీస్తుండవనియు నిశ్చయముగ ఒప్పుకొంటివి - స్వంత పనులకు సాగిపోతివి || ఆది ||
2. సిలువ మోయుచు యేసుప్రభుకే కాలమెల్ల సేవచేయుచు ఎల్ల ప్రజలకు సాక్ష్యమిచ్చుచు - వెళ్లేదనని పలికితివిగా || ఆది ||
3. మనుష్య సంగతులను తలంచి మనుష్యేచ్ఛలకు లొంగిపోయి యేసుప్రభుని అనుమానించి - ధనమోసంబులో చిక్కుకొంటివి || ఆది ||
4. ఏమి తిని త్రాగుచుందునో ఏమి ధరించుదునోయని నమ్మకత్వము కోల్పోయి - అమ్ముకొంటివా నీదు ప్రభుని || ఆది ||
5. మేడమిద్దెల పొలము ఆస్తుల పుడమి నికనెన్నో ఘనతలకు ఇదియే సమయమని తలంచి - నీదు ప్రభునెదిరించిపోదువా || ఆది ||
6. యేసుక్రీస్తు సేవయందు ఏమి కొదువను చూచి యిట్లు మార్చుకొంటివి నీదునడతను - నాథుడేసుడు ఏడ్చుచుండె || ఆది ||
7. నీదు దీపము యింక యిలలో ఆరిపోవక ముందె నెరిగి సాధువై ప్రార్థించు యేసుని - ఆది ప్రేమతో సేవజేయుము || ఆది ||