#536Telugu Spiritual Song
Velledamu koodi velledamu - Shresta deshamunu cherutaku
వెళ్లేదము కూడి వెళ్లేదము - శ్రేషష్ఠ దేశమును చేరుటకు
ప|| వెళ్లేదము కూడి వెళ్లేదము - శ్రేషష్ఠ దేశమును చేరుటకు
నీతి నివసించును అందున
1. భయమును కలిగి బ్రతికెదము - పరదేశులమని యెరుగవలె
ప్రవేశించవలె విశ్రాంతిలో - తప్పిపోదుము మరచినచో || వెళ్లే ||
2. ప్రభువాజ్ఞలను పాలించుటకు - ప్రయాసపడెదము మనమిలలో
పదిలముగా అంతము వరకు - పడిపోకుండా చూచుకొందుము || వెళ్లే ||
3. ప్రభువు మన కప్పగించినవి - పట్టుకొని మనముండెదము
దుష్టుని బారిని తప్పించుకో - దోచుకొని నివ్వకు మకుటము || వెళ్లే ||
4. సుళువుగా ఉరియొడ్డు ప్రతిపాపమున్ - సంపూర్ణముగను తొలగించుచు
సహనముతోడ పరుగెత్తుచు - స్వర్గ దేశము చేరవలెన్ || వెళ్లే ||
5. సంపూర్ణత పొందసాగెదము - సమర్పించుకొని పూర్ణముగా
సహించిన కష్టదుఃఖములు - బహుగా ఫలమొందెదము || వెళ్లే ||
