18px
#537Telugu Spiritual Song

Naa priyamaina yesu Prabhu - velaadhi stotramulu

నా ప్రియమైన యేసుప్రభు - వేలాది స్తోత్రములు

ప|| నా ప్రియమైన యేసుప్రభు - వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా - స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా - స్తోత్రము స్తోత్రములు
1. ఆపద దినములలో - నా ప్రభుని తలచితిని దేవా నీ దయతోడనే నాధా - ఆశ్రయం పొందితిని
2. ఒక క్షణ సమయములో - నశించు నా జీవితం నా హృదయం మార్చితివి - దేవా కృపతోనే జీవించుటకై || నా ||
3. లోకపు పాపములో - నే పాపిగ జీవించితిని శుద్ధ హృదయమిచ్చావు దేవా - నిన్ను నే దర్శించుటకై || నా ||
4. ఈ దినమునే పాడుట - నీ వలనే యేసుప్రభు ఎల్లప్పుడు నే పాడెదన్ దేవా - నాయందు వసియించుము || నా ||
5. మందిర సమృద్ధిని - నీ ప్రజల సహవాసమును నీ సన్నిధి ఆనందమును దేవా - కృపతోనే నొసగితివి || నా ||