#538Telugu Spiritual Song
Halleluya paadeda prabhu-ninnu koniyadedan
హల్లెలూయ పాడెద... ప్రభు నిన్ను కొనియాడెదన్
ప|| హల్లెలూయ పాడెద... ప్రభు నిన్ను కొనియాడెదన్
అన్ని వేళలయందున - నిన్ను పూజించి కీర్తింతును
ప్రభువా - నిన్ను నే కొనియాడెదన్
1. వాగ్ధానముల నిచ్చి - నెరవేర్చువాడవు నీవే (2)
నమ్మకమైన దేవా - నన్ను కాపాడు వాడవు నీవే (2)
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ || హల్లె ||
2. నాదు శత్రువులను - పడద్రోయువాడవు నీవే
మహా సామర్థ్యుండవు - నా రక్షణ శృంగము నీవే
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ || హల్లె ||
3. ఎందరు నిన్ను చూచిరో - వారికి వెలుగు కల్గెన్
ప్రభువా నే వెలుగొందితిన్ - నా జీవంపు జ్యోతివి నీవే
ప్రభువా - నిన్ను నే కొనియాడెదన్ || హల్లె ||
4. భయమును పారద్రోలి - అభయము నిచ్చితివి
ఎబినేజరు నీవై ప్రభు - నన్ను సంరక్షించుచుంటివి
ప్రభువా - నిన్ను నే కొనియాడెదన్ || హల్లె ||
5. కష్టములన్నింటిని - ప్రియముగా భరియింతును
నీ కొరకే జీవింతును - నా జీవంపు దాతవు నీవే
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ || హల్లె ||
6. ఈ జీవిత యాత్రలో - ఏమి సంభవించిన
మహిమ నీకే ఓ ప్రభు - ఇదియే నా దీన ప్రార్థనా
ప్రభువా - నిన్నే నే కొనియాడెదన్ || హల్లె ||
