#539Telugu Spiritual Song
Shramalanu Ponde sree Yesudu - nee korakai siluvalo
శ్రమలను పొందె శ్రీ యేసుడు నీ కొరకై సిలువలో
ప|| శ్రమలను పొందె శ్రీ యేసుడు నీ కొరకై సిలువలో
1. సదయుడు ప్రేమించె శత్రువైన నిన్ను - దూరస్థుడవైన నీ యెడల దయ చూపించె
వహించె నీ శాపం భరించె నీ పాపం - నీ మనస్సు మార్చుకొనిన
సంతసించును ప్రభుయేసు || శ్రమ ||
2. దొంగవై నీవున్నా దురితంబులెన్నున్నా - దోషంబుల క్షమియించు తన సిలువ రక్తముతో
తెరచునుగా నీ కొరకు పరలోకద్వారము - నెమ్మది నిచ్చును నీకు యేసుని విశ్వసించిన
3. ఎవరేసు రక్తములో కడుగబడెదరో - వారే చేరెదరు తన సంఘమునందు
అంగీకరించుము యేసును నీవు కలిగించు నీకు తృప్తిని నేడే నీ వాయనను వేడు
4. సిలువపై యేసు సర్వమర్పించె - నీ రక్షణ కొరకు క్రయము చెల్లించె
యేసునకు నీవు ఏమియ్యగలవు? - తెరువు నీ హృదయ ద్వారమును
నేడే ప్రవేశించును తాను
