18px
#540Telugu Spiritual Song

Prabhuvaa guri yoddake-parugetthu chunnanu

ప్రభువా, గురియొద్దకే - పరుగెత్తుచున్నాను నేను

ప|| ప్రభువా, గురియొద్దకే - పరుగెత్తుచున్నాను నేను ఉన్నత పిలుపునకు కలుగు - బహుమానము పొందవలెనని
1. ఏవేవి లాభకరములైయుండెనో - వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా నెంచుకొని - ముందుకే సాగుచున్నాను || ప్రభువా ||
2. క్రీస్తును సంపాదించుకొని - తన పునరుత్థాన బలమును ఎరిగి ఆయన శ్రమలలో పాలి వాడనగుదున్ || ప్రభువా ||
3. క్రీస్తును గూర్చిన అతి శ్రేషష్ఠమైన - జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను || ప్రభువా ||
4. వెనుకనున్నవి మరచి - ముందున్న వాటి కొరకై వేగిరపడుచు ధైర్యముగా ముందుకే సాగుచున్నాను || ప్రభువా ||