18px
#541Telugu Spiritual Song

Nee jeevitamulo-gamyambhu yedo-oka saari yochinchavaa

నీ జీవితములో గమ్యంబు యేదో - ఒకసారి యోచించవా

ప|| నీ జీవితములో గమ్యంబు యేదో - ఒకసారి యోచించవా ఈనాడే నీవు ప్రభుయేసు కొరకు - నీ హృదయమర్పింపవా
1. నీ తల్లి గర్భమున నుండినపుడే - నిను చూచె ప్రభు కన్నులు(2) యోచించినావా ఏ రీతి నిన్ను - నిర్మించె తన చేతులు || నీ జీవి ||
2. నీలోన తాను నివసింపగోరి - దినమెల్ల చేజాచెను(2) హృదయంపు తలుపు - తెరువంగ లేవా - యేసు ప్రవేశింపను || నీ జీవి ||
3. తన చేతులందు రుధిరంపుధారల్ - స్రవియించె నీ కోసమే(2) భరియించె శిక్ష నీ కోసమేగా - ఒకసారి గమనించవా || నీ జీవి ||
4. ప్రభుయేసు నిన్ను సంధిరచినట్టి - సమయంబు ఈనాడేగా (2) ఈ చోట నుండి ప్రభుయేసు లేక - పోబోకుమో సోదరా! || నీ జీవి ||