#542Telugu Spiritual Song
Evaro theylusaa Yesayya - chebutha neydu vinavayya
ఎవరో తెలుసా యేసయ్యా - చెబుతా నేడు వినవయ్యా
ప|| ఎవరో తెలుసా యేసయ్యా - చెబుతా నేడు వినవయ్యా
పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా
1. దేవాది దేవుడు యేసయ్యా - మానవ జన్మతో వచ్చాడయ్యా
మరణించాడు మరిలేచాడు - నీ నా పాప విమోచనకే || ఎవరో ||
2. ధనవంతుడై యుండి యేసయ్యా - దరిద్రుడై ఇల పుట్టాడయ్యా
రూపురేఖలు కోల్పోయాడు - నీ నా పాప విమోచనకే || ఎవరో ||
3. పాపుల రక్షకుడేసయ్యా - కార్చెను రక్తము పాపులకై
తన దరిజేరిన పాపులనెల్ల - కడుగును తనదు రక్తముతో || ఎవరో ||
4. యేసే దేవుడు ఎరుగవయ్యా - రాజుల రాజుగా వస్తాడయ్యా
నమ్మిన వారిని చేర్చును పరమున - నమ్మనివారికి నరకమేగా || ఎవరో ||
5. యేసుని తరపున ప్రతినిధినై - దేవుని ప్రేమకు ప్రతిరూపమై
అతి వినయముగా బ్రతిమాలుచున్నాను - నేడే నమ్ముము యేసుప్రభున్ || ఎవరో ||
