18px
#543Telugu Spiritual Song

Nee swaramu vinipinchu prabhuvaa —nee daasudalakinchun

నీ స్వరము వినిపించు ప్రభువా - నీ దాసుడాల కించున్

ప|| నీ స్వరము వినిపించు ప్రభువా - నీ దాసుడాల కించున్ నీ వాక్యమును నేర్పించు - దానియందు నడుచునట్లు నీతో
1. ఉదయమునే లేచి నీ స్వరము వినుట - నాకు ఎంతో మధురము దినమంతటి కొరకు నను సిద్ధపరచు - రక్షించు ఆపదల నుండి || నీ ||
2. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు - నేను సరిజేసికొందు నీ మార్గములో నడచునట్లుగా - నేర్పించుము ఎల్లప్పుడు || నీ ||
3. భయభీతులలో తుఫానులలో - నీ స్వరము వినిపించుము అభయము నిమ్ము ఓ గొప్పదేవా - ధైర్యపరచుము నన్ను || నీ ||
4. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా - నీ స్వరము నా కొరకే నీతో మనుష్యులతో సరిజేసికొందు - నీ దివ్య వాక్యము ద్వారా || నీ ||
5. నీ వాక్యము అగ్ని సుత్తె వంటిది - అది రెండంచులు గల ఖడ్గం నీ వాక్యమేగా అద్భుత అద్దం - నిజ స్వరూపమును చూపించున్ || నీ ||
6. నేర్చుకొన్నాను నా శ్రమల ద్వారా - నీ వాక్యమును ఎంతో నన్నుంచుము ప్రభువా నీ విశ్వాస్యతలో - నీయందు నిలచునట్లుగా || నీ ||
7. నా హృదయములోని చెడు తలంపులను - ఛేదించు నీ వాక్యము నీ రూపమునకు మార్చును నన్ను - నీదు మహిమ కొరకేగా || నీ ||