18px
#544Telugu Spiritual Song

Lokamunu vidachi vella valenugaa

లోకమును విడచి వెళ్లవలెనుగ సర్వమిచ్చటనే విడువవలెన్

ప|| లోకమును విడచి వెళ్లవలెనుగ సర్వమిచ్చటనే విడువవలెన్
1. యాత్రికులము ఈ దుష్టలోకములో - పాడులోకములో మనకేది లేదు యే విషయమందైన గర్వించలేము - జాగ్రత్తగానే నడచుకొనెదము || లోక ||
2. కష్టబాధలచే బ్రతుకంత నిండె - కన్నీళ్లు నిరాశ నిస్పృహల మయము కరుణా కటాక్షము నమ్మెదము - క్రీస్తు ప్రభునిపై దృష్టి నుంచెదము || లోక ||
3. ఎంతవరకు ఈ భువి యందుండెదమో - సైతానుతో సదా పోరాటమేగా శత్రుని తంత్రాల నెరిగితిమి - ధైర్యముతోనే కొనసాగెదము || లోక ||
4. గతము నంతటిని మరచిపోయెదము - గురియొద్ద కానందముతో వెళ్లేదము మార్గాన వచ్చేటి శ్రమల నోర్చి - అర్హులమౌదము బహుమానమొంద || లోక ||
5. మన ఈర్ష్య కపట ద్వేషాలు విడచి - నిజ ప్రేమతోనే జీవించెదము నిష్కళంకులమై శుద్ధులమై - పరిపూర్ణతను చేపట్టుదము || లోక ||
6. జీవముగల ప్రభు రక్షించె మనల - విమోచించి నూతన జీవమొసగె కొనిపోవ క్రీస్తు త్వరగా వచ్చున్ - అందుచే మనము సిద్ధపడెదము || లోక ||
7. ఆత్మీయ నేత్రాలతో చూచెదము - ఎంత అద్భుతము సౌందర్య నగరం ప్రభువు చెంతకు వెళ్లేదము - విజయోత్సవముతో ప్రవేశించెదం || లోక ||