#545Telugu Spiritual Song
Daari tholagithivela (2) - rakshana maargamu vedaku
దారి తొలగితివేల (2) - రక్షణ మార్గము వెదకు
ప|| దారి తొలగితివేల (2) - రక్షణ మార్గము వెదకు (2)
1. పాపమందే జన్మించితివి (2)
పాపమందే జీవించితివి (2) - ఎరుగకున్నావు (2) || రక్షణ ||
2. పాప ఫలితము ఘోర మరణము
నరకదండన అగ్నిగుండము - మారుమనస్సు నొందు || రక్షణ ||
3. నేడే యేసుని వాక్యము వినుము
నేడే ప్రభుని స్వరము వినుము - తన చిత్తము నెరుగు || రక్షణ ||
4. నీవు నశించుట కోరడు ప్రభువు
తరుణముండగ వేడుకొనము - ఎరుగు నీ స్థితిని || రక్షణ ||
5. అందరిని మారుమనస్సును పొందుమని
ప్రభువాజ్ఞాపించి - పశ్చాత్తాపపడుము || రక్షణ ||
6. ఒప్పుకొనుము నీ పాపమును
క్షమాపణకై వేడుకొనుము - రక్షణ పొందెదవు || రక్షణ ||
7. విశ్వాసముతో అడిగిన యెడల
పొందితివని నిశ్చయముగ నెరుగు - గొప్ప రక్షణ యిదియే || రక్షణ ||
