#546Telugu Spiritual Song
Yesu manatho nundaga dairyamutho saaguchu
యేసు మనతోనుండగ ధైర్యముతో సాగుచు
ప|| యేసు మనతోనుండగ ధైర్యముతో సాగుచు
కరిఠన మార్గమైనను వెనుకకు తిరుగము
1. పాతసంగతులన్నియు గతించె మరల రావుగా
యేసునందు క్రొత్త్తవై నూతనముగ నడుపును
యేసుప్రభుని యాజ్ఞలు అద్భుతముగ దొరికెను
పరమ దర్శనమందుండి తొలగిపోము యెన్నడు || యేసు ||
2. సైతాను శరీరము లోకముతో పోరాడుచు
యెంత క్రయమునైనను సంతోషముగ చెల్లింతుము
యుద్ధమందు జయమొంద ప్రభుని శక్తి పొందెదం -
యేసు జయము పొందుచు సాతాను రాజ్యమణచెదం || యేసు ||
3. దుఃఖ రోగ బాధలు కలిగిన చింతించక - యేసునామమందున పొందెదము శక్తిని
అల్పకాల యాత్రలో గొణుగు నణుగులుండక
ప్రతి పరిస్థితియందు తృప్తిచెంది యుందుము || యేసు ||
4. క్రీస్తు యేసు మనసునే మనము కలిగియుందము
ఈర్ష్యక్రోధ విరోధముల్ విడచి ప్రేమ చూపెదం
నాగటిమీద చేతిని వుంచి వెనుక తిరుగము
యేసువైపు చూచుచు ఆయనతోడ నడచెదం || యేసు ||
5. మనలో పాత పురుషుని చంపెదము సిలువతో
అంతరంగ పురుషునందు బలమును పొందెదము
ఆత్మీయ జీవితంబులో ఉన్నత స్థానము పొందెదం
శరీర యిచ్ఛలన్నియు అణగద్రొక్కి వేసెదం || యేసు ||
6. విడచెదం ఈ లోకము యాత్ర పూర్తి చేసెదం
పరమ రాజ్యమందున పరమ గృహము చేరెదం
యేసు ప్రభును సంధించెదం ఆనందముతో నిండెదం
బహుమానములు పొందెదం - సదా ఆయనతో నుండెదం || యేసు ||
