18px
#547Telugu Spiritual Song

Devunitho sahapaati paalivaariganu jese

దేవునితో సహపాటి పాలివారిగాను జేసె

ప|| దేవునితో సహపాటి పాలివారిగాను జేసె తోడివారసులనుగా మనలను ప్రభు జేసెనుగా
1. దుష్టులోకము నుండి అద్భుతముగా రక్షించె - అమూల్య వాగ్ధానములిచ్చి దైవ స్వభావ మొసగెనుగా || దేవుని ||
2. దైవ వెలుగును పొంది దైవాత్మలో పాలుపొంది దివ్యవాక్యమును పొంది - దివిని రుచి చూచితిమి || దేవుని ||
3. ప్రభు పరిశుద్ధతలో పాలివారమగునట్లు సకల శ్రమలపాలై - దైవశిక్ష నొందితిమి || దేవుని ||
4. పరలోక పిలుపునందు పాలివారిగాను జేసె తన యింటివారినిగా జేయ - మనల నేర్పరచె || దేవుని ||
5. తండ్రిని స్తుతించెదము యోగ్యులుగా మముజేసెపరిశుద్ధుల స్వాస్థ్యములో - పాలివారిగా జేసె || దేవుని ||
6. క్రీస్తులో పాలివారై క్రీస్తు సుగుణములను పొంది దృఢముగా నిలిచెదము - పట్టువదలక మనము || దేవుని ||
7. రాబోవు మహిమయందు పాలివారమౌ మనము ప్రభువు సెలవిచ్చెనుగా - ప్రియులను మేల్కొల్పెదము || దేవుని ||