#549Telugu Spiritual Song
Ella vela landu - kasta kaalamandu
ఎల్లవేళలందు కష్టకాలమందు - వల్లభుండా యేసు స్తుతింతున్
ప|| ఎల్లవేళలందు కష్టకాలమందు - వల్లభుండా యేసు స్తుతింతున్
ఎల్లను నీవే నా కెల్లెడల - వల్లపడదే వివరింప
1. విమోచకుడా విమోచన మీవే - రక్షకుడవు నా రక్షణ నీవే || ఎల్ల ||
2. సృష్టికర్తవు సహాయము నీవే - ఇష్టుడ నీవు - త్రిత్వము నీవే || ఎల్ల ||
3జ్ఞానము నీవే నా పానము నీవే - దానము నీవే నా గానము నీవే || ఎల్ల ||
4. జ్యోతియు నీవే నా నీతియు నీవే - ఆదియు నీవే నా అంతము నీవే || ఎల్ల ||
5. నిత్యుడ నీవే నా సత్యుండ నీవే - స్తోత్రము నీవే నా నేత్రము నీవే || ఎల్ల ||
6. జీవము నీవే నా దేవుడ నీవే - పావన మీవే నా కావలి వీవే || ఎల్ల ||
7. కాంతియు నీవే నా శాంతియు నీవే - సంతసమీవే నా కంతయు నీవే || ఎల్ల ||
