18px
#550Telugu Spiritual Song

Kriste Ee jeevitamulo enthaina manchi

క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచికాపరి

ప|| క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచికాపరి దుఃఖ సుఖంబులలో - ఆయనే సహాయకుడు మనకు
1. కష్టబాధలలో మన ప్రభువు - సమీపముగా నుండెనెంతో గాలి తుఫానులను గద్దించుచు - మనతో నుండు యాత్రలో || క్రీస్తే ||
2. ఇహలోక సాగరము దాటునప్పుడు - అలలెంతో మనలను కదిలింపగా మునుగునప్పుడు మొరపెట్టిన - మనల రక్షించుతానే || క్రీస్తే ||
3. జీవితనావపై దాడిచేసే - సాతాను క్రియలకు భయపడక ధైర్యము కొరకై ప్రార్థించిన - ప్రభువే మనల నడుపున్ || క్రీస్తే ||
4. జీవితములో నిరాశచే - కృంగిపోయి మనమున్నప్పుడు విజయమునిచ్చి బలపరచి - జీవికిరీటమిచ్చును || క్రీస్తే ||
5. యేసు ప్రభువే మనదుర్గము - ఆయనయందే నిలిచినచో నిశ్చయముగ జయింతుము - ఓడిపోవును శత్రువు || క్రీస్తే ||