18px
#551Telugu Spiritual Song

Neethimanthula praardhana - devudaalakinchunu

నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును

ప|| నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును వారు తమాల వృక్షమువలె మొవ్వు వేయుదురు (2)
1. మొరపెట్టుము గ్రాహ్యము కాని గొప్ప సంగతులు మరియు గూఢమైన సంగతుల దేవుడే తెలుపున్ || నీతి ||
2. గతకాలమున క్రీస్తు పేరట అడుగకుంటిరి సతతము ఆనంద మొంద అడుగుడి దొరకున్ || నీతి ||
3. యెహోవా కొరకు ఎదురుచూచి పొందుడి బలము ఇహమునందు పక్షిరాజువలె పై కెగురుదురు || నీతి ||
4. ఊహించలేనిది శక్యము గానివైనట్టి క్రియలను యెహోవా చేయ శక్తిమంతుడు అత్యధికముగా || నీతి ||
5. మిమ్ము విడువనెన్నడు నెడబాయనననెగదా నమ్ముము నరమాత్రుండెపుడే హానిచేయడు || నీతి ||
6. ఆ ప్రభు తన ఐశ్వర్యమందు క్రీస్తు యేసులో మీ ప్రతి యవసరము తీర్చి కాదు నిరతమున్ || నీతి ||
7. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును నిశ్చయముగా వృద్ధిపొందింతుననె నీ దేవుడు || నీతి ||