#552Telugu Spiritual Song
Akasha mahakaashambulu - pattani aashcharya karudaa
ఆకాశ మహా - కాశంబులు పట్టని ఆశ్చర్యకరుడా
ప|| ఆకాశ మహా - కాశంబులు పట్టని ఆశ్చర్యకరుడా
1. కృపజూపి నిబంధనను - నెరవేర్చిన ఉపకారీ
కాపాడితివి నడిపితివి - నీ యింటికి మమ్ములను || ఆకాశ ||
2. నీ దాసునికి నీ ప్రజలకు - నీ క్షమను కనుపరచు
నీదు కల్వరి రక్తమున - నీవె కడుగు కరుణామయ || ఆకాశ ||
3. నీతి న్యాయముల కర్త - ప్ర"తితోడ నీ ప్రజలకు
నీతి న్యాయముల నిమ్ము - స్తుతియింప నిరతంబు || ఆకాశ ||
4. రాజులనుగా యాజకులనుగా - మము చేసిన మా రాజా
విజయమిమ్ము మా విజయుండా - నిజమైన నీ ప్రజలకు || ఆకాశ ||
5. కరువు తెగులు కష్టనష్టముల్ - వర్షలేమి పురుగు బాధల్
కరుణజూపి విడిపించి - మురిపించుము మమ్ములను || ఆకాశ ||
6. సమాధాన సంతోషము - ఆదరణ ఆలోచన అనుభవింప
ననుగ్రహించు - మనిశంబు మాకిచట || ఆకాశ ||
7. బలపరచు నీ భక్తులను - బలముతోడ ప్రవేశించి
విలువైన నీ రక్షణను - ధరింపజేయు మల్లెలూయ || ఆకాశ ||
