#553Telugu Spiritual Song
Nimpumu O prabhuvaa-sarva sampoornathatho
నింపుము ఓ ప్రభువా! సర్వ సంపూర్ణతతో
ప|| నింపుము ఓ ప్రభువా! సర్వ సంపూర్ణతతో
మేము నిండియుండెదము - పరిపూర్ణత నొందెదము
1. పాప క్షమాపణ నిచ్చి - జీవముతో నింపుము
ఆత్మీయ వరమిచ్చిన - బలముతో నిండెదము || నింపుము ||
2. పరమ సంతోషమిచ్చి - సమాధానంబిమ్ము
చూపించు పరలోక మహిమ - ప్రకాశముతో నింపు || నింపుము ||
3. ఆత్మ ఫలములతో నింపి - ప్రేమ సంతోషము
మంచితనము సాత్వీకము విశ్వాసముతో నింపు || నింపుము ||
4. నింపు సత్యముతో మమ్ము నిల్పు - ప్రత్యక్షతలో
నీ జ్ఞానముతో నింపిన స్తుతితో నిండెదము || నింపుము ||
5. పరమాశీర్వాదమిచ్చి - తప్పించు యిహమునుండి
అర్హులుగా చేయు పరమునకై - ఆశించుచున్నాము || నింపుము ||
