18px
#554Telugu Spiritual Song

Karuninchi thirigi sama koorchu prabhuvaa

కరుణించి తిరిగి - సమకూర్చు ప్రభువా

ప|| కరుణించి తిరిగి - సమకూర్చు ప్రభువా క్షమాపణ నిన్ను - వేడుచున్నాను
1. దావీదు రాజు దీనుడైవేడ అవనిలో బొందిన నష్టములన్నియు - దేవా నీవు సమకూర్చితివే || కరు ||
2. శత్రు సమూహపు కుతంత్రములతో - బొత్తిగ నేను నష్టపడితిని మిత్రుడేసులో - సమకూర్చుము తండ్రి || కరు ||
3. పసరు గొంగళి చీడ పురుగులు - నాశము చేసిన పంటను కూర్చుమా యేసుప్రభూ నిన్ను వేడుచున్నాను || కరు ||
4. ప్రేమ సంతోషా - నందములను - ప్రధాన యాజకా పోగొట్టుకొంటిని ప్రేమతో నీవు సమకూర్చుమా || కరు ||
5. పాపపు విషముతో నా పాత్ర నిండెను - ప్రభు యేసుండను - పిండిని కలుపుము పాప మరణమును తొలగించుమా || కరు ||
6. ఆత్మీయ సోమరితనములో నుండి - ఆత్మ నష్టముల నెన్నియో బొందితి ఆత్మదేహ నీవు - సమకూర్చుమా || కరు ||
7. పాపము చేసి - పడియున్న చోటున్ - ప్రాపుగ నీవు జూపుమో ప్రభువా కోపించక నాపై కృపజూపుచూ || కరు ||
8. చేసిన పాపము - కప్పుకొనక - విశ్వాసముతో ఒప్పుకొందున్ సిలువ రక్తముతో శుద్ధిచేయుమా || కరు ||