#555Telugu Spiritual Song
Prabhuvaa nee kaaryamunu
ప్రభువా నీ కార్యమును - నూతన పరచుము మాలో
ప|| ప్రభువా నీ కార్యమును - నూతన పరచుము మాలో
పరిశుద్ధ దేవా నీకు - ప్రజలమైయున్నామిలలో
1. సంవత్సరములు జరుగుచుండగనే - సత్యదేవా
విలువైన నీదు కార్యమును - తెలియజేయుము మాకు || ప్రభు ||
2. పాపము జేసి నీదు కోపము రేపితివయ్యా
కోపించుచునే నీదు - వాత్సల్యము జూపుమయ్యా || ప్రభు ||
3. ప్రేమతో మము రక్షించి - క్షేమము నిచ్చితివయ్యా
ప్రేమించకున్నాము మేము - ప్రేమామయుడా నిన్ను || ప్రభు ||
4. వెలిగించితివి మమ్మిలలో - వెలుగైన ఓ మా ప్రభువా
పలుచోట్లలోన మేము - వెలుగకున్నామయ్యా || ప్రభు ||
5. మారుచున్న లోకమున - కారు' - ట్లలో త్రాగన్
జీవపు ఊటవు నిన్ను విడచి - త్రోవతప్పితిమయ్యా || ప్రభు ||
6. సోదర ప్రేమను జూపు - మాదిరి విడచితిమయ్యా
ఓదార్పుపొందిన మేము - ఆదరణియ్యకున్నాము || ప్రభు ||
7. మేలిమి బంగారుగను - మమ్ముల జేసితివయ్యా
మాలిన్యమువంటి మేము - మందగిలియున్నాము || ప్రభు ||
8. మాటతప్పని మాదేవా - కోటగా నున్నావయ్యా
చాటించెద నీదు ప్రేమన్ - సాటిలేని ప్రియుడా || ప్రభు ||
