#556Telugu Spiritual Song
Parama tandri karamuleththi stutula narpintumu
పరమతండ్రి కరములెత్తి - స్తుతుల నర్పింతుము
ప|| పరమతండ్రి కరములెత్తి - స్తుతుల నర్పింతుము
శిరములెత్తి స్వామి నీకై చూచుచుంటిమి
ఉజ్జీవనాత్మ నొసగు నిలువ సజీవ సాక్షిగ
1. పాప శాపములందు మేము - పడిచెడియుండగా
దేవమాదు దరికి జేరి - లేవ నెత్తితివి
ఎంత జాలి ఎంత ప్రేమ - స్తుతుల నర్పింతుము || పరమ ||
2. దినదినము నిను శోధించి - దుఃఖ పెట్టితిమి
కేవలము శరీరులమని - కనికరించితివి
క్షమించి మమ్ము కడిగితివి - స్తుతులనర్పింతుము || పరమ ||
3. నింద వేదన శ్రమలు బహు - నిట్టూర్పులయందు
విసుగకుండ సేవచేయ - నొసగు నోర్పును
నింపు నీ శుద్ధాత్మతోను - స్తుతుల నర్పింతుము || పరమ ||
4. సూర్యచంద్ర తారలందు - వింత సూచనలు
జరుగ జనులు ధైర్యముచెడి - కూలి చూచెదరు
అయితే నీకై చూచు మేము - బలము నొందెదము || పరమ ||
5. సమాజముగ కూర్చి నీదు - సన్నిధియందు
ప్రార్థన సహవాసములలో - స్థిరులజేయుము
తేరిచూస్తూ నీ రాకడకై - స్తుతుల నర్పింతుము || పరమ ||
6. శత్రుటురులు త్రుంచివేసి - జీవమిచ్చితివి
ఆహా! యేమర్పింతుము - నీ ఉపకారములకై
చేతబట్టి రక్షణపాత్ర - స్తుతుల నర్పింతుము || పరమ ||
7. గత బ్రతుకులో వాత్సల్యమున - గాచి ఈ క్షితిన్
నడిపె నవ్యవత్సరముకై - కృపాక్షేమములతో
సత్యుడ సిల్వశక్తి నొసగు - సాగముందుకు || పరమ ||
