#557Telugu Spiritual Song
Karuninchumu naa Yesuwa - kanikaramandaishwaryudaa
కరుణించుము నా యేసువా - కనికరమందైశ్వర్యుడా
ప|| కరుణించుము నా యేసువా - కనికరమందైశ్వర్యుడా
రేయింబగళ్లు నే నెలుగెత్తి మొరబెట్టు - ప్రార్థనకు చెవియొగ్గుమా
1. నిత్యము మాకై విజ్ఞాపన చేయు - నిశీద రాత్రిన్ ప్రియుడా
ప్రేమపితా నేడు మీ ఎదుట ప్రార్థించే - ప్రియుల ప్రార్థన వినుమా || కరు ||
2. మా బంధుజనులు మా తల్లిదండ్రులు - మా ప్రియులు నశియించుట
చూచి సహించక కన్నీటితో చేయు - మా ప్రార్థన వినుమా || కరు ||
3. నీనెవె పట్టణ దుర్గతిని జూచి - కరుణించి కాపాడితివే
యోనా మొరకొసగిన ఆలోచన - నా కొసగ నా బీదమనవి వినుమా || కరు ||
4. శ్రమలెన్నో సహించి రక్షించితివే - ఇవియన్నియు వ్యర్థంభలొనా?
అంజూరపు చెట్టుకై ప్రార్థించినా - యట్టి ఆ ప్రార్థన వినుమా || కరు ||
5. శోధన నుండి రక్షించితివే - సొదొమలో భక్తుని
అబ్రహాం ఆనాడు విన్నవించినట్టి - ఆది ప్రార్థన వినుమా || కరు ||
