#558Telugu Spiritual Song
Nee paada sannidiki - krupaamaya Yesayyaa
నీ పాద సన్నిధికి - కృపామయ యేసయ్యా
ప|| నీ పాద సన్నిధికి - కృపామయ యేసయ్యా
నీ ప్రేమ కనుగొనుచు - దేవా నే వచ్చితిని
1. విశ్రాంతి నిచ్చెడు దేవా - శ్రమలెల్ల తీర్చుమయ్యా
సిలువయే నా ఆశ్రయము - హాయిగా నచటుండెదను || నీ ||
2. ప్రార్థించుమంటివి ప్రభువా - సంకట సమయములో
దయజూపి నను కరుణించి - ప్రేమతో ఆదరించుమయ్యా || నీ ||
3. నరమాత్రుడవు నీవు కావు - మొఱ నాలకించుము
మనస్సార ప్రార్థించుచు - యేసు నీ దరి చేరెదను || నీ ||
4. నన్ను చేయి విడువకు నాథా - నిందలెన్నో పొందినను
నీకై సహించెదనంత - నీ బలము నాకిమ్ము || నీ ||
5. ఆశతో నీ ముఖమును నేనే - ఆసక్తితో చూడ
సిగ్గుపడనుగా నేను - నీ ప్రకాశము నాపై నుండ || నీ ||
6. శత్రువు నోడించుటకు నీ శక్తిని చూపు
నన్నాదరించి నీవు - ఆవరించి కాపాడుము || నీ ||
7. జీవించి ఎదుగునట్లు - జయ జీవితంబిమ్ము
ఫలించి వర్థిల్లుటకై - ప్రభువా నీ కృప నిమ్ము || నీ ||
8. సీయోను మూలరాయి - అయున్న ఓ ప్రభువా
కలతను చెందక నేను - నీకై కనిపెట్టెదను || నీ ||
