18px
#559Telugu Spiritual Song

Velledamu mari dhairyamutho - krupaasanamu cheranu

వెళ్లేదము మరి ధైర్యముతో - కృపాసనము చేరను

ప|| వెళ్లేదము మరి ధైర్యముతో - కృపాసనము చేరను తన కనికరము కృపలను పొంద - తానె సహాయకుడు
1. మన ప్రార్థన ప్రభువాలకించి - అత్యధికముగా మనకిచ్చును మేల్కొని మనము ప్రార్థించిన - ఆశీర్వదించునుగా || వెళ్లి ||
2. ఆత్మలనెల్ల ప్రభు రక్షించి - తన మందిరమునకు తెచ్చి తన ఆలయములో మేలుపొంద - వేడెదము మనము || వెళ్లి ||
3. అందరికి రక్షణ కలుగ - రాజులకు అధికారులలో సర్వలోకుల ఉజ్జీవముకై - వేడెదము ప్రభునే || వెళ్లి ||
4. వాక్యము వర్ధిల్లి వ్యాపింపను - శత్రుని రాజ్యము కూలునట్లు సేవకులాత్మతో నింపబడ - వేడెదము మనము || వెళ్లి ||
5. ఆత్మతో ప్రభుయింటిని కట్టి - దానియందు ప్రభు మహిమ నిండి తన ఘనత వర్ధిల్లునట్లు - వేడెదమాయనను || వెళ్లి ||
6. సజీవరాళ్లతో యిల్లుకట్టి - నీ అధికారము నిలుచునట్లు దేవా నీ హృదయానుసారులను - లేపమని వేడెదం || వెళ్లి ||