18px
#560Telugu Spiritual Song

Oh karunaanidhi mahaa prabhu

ఓ కరుణానిధీ, మహాప్రభుయేసు - నీవే సింహాసనాసీనుడవైతివి

ప|| ఓ కరుణానిధీ, మహాప్రభుయేసు - నీవే సింహాసనాసీనుడవైతివి
1. సత్యస్వరూపివి పరిశుద్ధుడవు - దావీదు తాళము కల్గియున్నావు నీవు తెరచినది మూయగలేరు - బంధించినది తెరువగలేరెవ్వరు నీ మహాత్మ్యమదే
2. ఏడు నక్షత్రములు నీచేత కలవు - దీప స్తంభముల మధ్య సంచరించెదవు జీవించువాడవు ఆది అంతములు - రెండంచుల ఖడ్గము కలిగిన ప్రభువా అదియే నీ ఘనత
3. అగ్నివంటి నేత్రములు కల్గి - అపరంజి వంటి పాదములు కలిగి దేవుని ఏడు ఆత్మలు కలిగి - గ్రంథము తెరచే యోగ్యుడ వీవే - ధన్యుడవు నీవే
4. నమ్మకమైన సత్యసాక్షియు - సర్వసృష్టికి కర్తయైయుండి నీతిమంతుడు బహుజ్వాలామయుడు - దీర్ఘశాంతుడు శక్తిమంతుడు అమెన్ అనువాడు
5. ఎల్లరు ప్రభుని స్తుతించెదరు - సాగిలపడెదరు కృతజ్ఞులై ఆశ్చర్యక్రియలు చేసితివంచు - ప్రభువా నీవే అగమ్యుడవంచు - నినుకొనియాడెదము